Wednesday, January 22, 2025

పెంపుడు మేకకూ రైలు టిక్కెట్..ఆ గామీణ మహిళ నిజాయితీకి వందనం(వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

వెబ్ డెస్క్: గ్రామీణ భారతంలో నివసించే ప్రజల నీతి, నిజాయితీకి జేజేలు కొట్టక తప్పదు. తనతో పాటు రైలులో ప్రయాణిస్తున్న మేకకు కూడా టిక్కెట్ కొని ఒక పేద గ్రామీణ మహిళ తన నిజాయితీతో లక్షలాది మంది ప్రజల హృదయాలను గెలుచుకుంది.

ఛత్తీస్‌ఘఢ్ క్యాడర్‌కు చెందిన ఐఎఎస్ అధికారి అవనీష్ శరణ్ ఇందుకు సంబంధించిన వీడియోను ఎక్స్(ఇదివరకటి ట్విట్టర్)లో పోస్టు చేస్తూ తన పెంపుడు మేకకు కూడా ఆమె రైలు టిక్కట్ కొన్నారు. ఇదే విషయాన్ని ఆమె టిటిఇకి గర్వంగా చెప్పారు. ఆమె ననవ్వు చూడండి.. అద్భుతం అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

ఈ వీడియోకు నెటిజన్ల నుంచి మంచి స్పందన లభించింది. ఆమె నిజాయితీని ప్రశంసిస్తూ పలువురు కామెంట్లు రాశారు. ఇటువంటి నాజయితీ పరుల వల్లే దేశం అభివృద్ధి చెంపతోంది అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేయగా సంపన్నుల కన్నా పేదవారే ఎక్కువ నిజాయితీపరులు అంటూ మరో నెటిజన్ వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News