Sunday, December 22, 2024

రైడ్ క్యాన్సిల్ చేసిన మహిళ: అశ్లీల వీడియోలు పంపిన క్యాబ్ డ్రైవర్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: చివరి నిమిషంలో క్యాబ్ రైడ్‌ను క్యాన్సిల్ చేసుకున్న ఒక 32 ఏళ్ల మహిళకు అశ్లీల వీడియోలు, మెసేజ్‌లు పంపి లైంగిక వేధింపులకు పాల్పడిన క్యాబ్ డ్రైవర్‌పై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

తన ఆరేళ్ల కుమార్తెను స్కూలు నుంచి ఇంటికి తీసుకెళ్లేందుకు ఒక మహిళ రైడ్ షేరింగ్ యాప్ ద్వారా క్యాబ్ బుక్ చేసింది. అయితే కుమార్తె ఆపకుండా ఏడుస్తుండడంతో క్యాబ్ రైడ్‌ను క్యానిల్ చేసి ఆమె ఆటోలో బయల్దేరింది. చివరి నిమిషంలో క్యాబ్ రైడ్‌ను క్యాన్సిల్ చేసినందుకు ఆమెకు రూ. 60 క్యాన్సిలేషన్ చార్జీలు కూడా పడ్డాయి. తన రైడ్‌ను క్యాన్సిల్ చేసినందుకు క్యాబ్ డ్రైవర్ దినేష్ ఆమె వాట్సాప్ నంబర్‌కు పదే పదే కాల్ చేస్తూ, మెసేజ్‌లు పంపసాగాడు. ఆమె అతని కాల్‌కు స్పందించి క్షమాపణ చెప్పినప్పటికీ అతడి నుంచి మెసేజ్‌లు ఆగలేదు.

అశ్లీల వీడియోలు, ఫోటోలను తన వాట్సాప్‌కు క్యాబ్ డ్రైవర్ దినేష్ పంపడం మొదలెట్టాడని అక్టోబర్ 9న పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె తెలిపారు. వైట్‌ఫీల్డ్ నివాసి అయిన ఆ మహిళ దినేష్ పంపిన వీడియోలకు సంబంధించిన స్క్రీన్‌షాట్లను పోలీసులకు పంపించారు. విషయం తెలుసుకున్న స్థానికులు దినేష్‌కు కాల్ చేసి కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. దీంతో అతను మెసేజ్‌లు, ఫోటోలు, వీడియోలు డెలిట్ చేశాడు.

అయితే, రైడ్‌ను క్యాన్సిల్ చేసుకున్న తర్వాత ఆ మహిళ ఫోన్ నంబర్ క్యాబ్ డ్రైవర్ దినేష్‌కు ఎలా లభించిందన్న ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశమైంది. డ్రైవర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తమకు అందచేయాలని రైడ్ షేరింగ్ యాప్‌ను ఆదేశించారు. ఐపిసిలోని సెక్షన్ 354ఎతోపాటు ఐటి యాక్ట్ కింద దినేష్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News