Wednesday, November 6, 2024

22 సార్లు సెల్‌ఫోన్ డ్రైవింగ్

- Advertisement -
- Advertisement -
woman caught driving cell phone in Nizampet
రూ.9 వేల జరిమానా

హైదరాబాద్ : నగరంలోని నిజాంపేటలో ఓ యువతి 22 సార్లు సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేస్తూ ట్రాఫిక్ పోలీసుల కెమెరాలకు చిక్కింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు యువతికి ఏకంగా దాదాపు రూ. 9 వేల పెనాల్టీలు వేశారు. సదరు యువతి ఎలాంటి భయం, జంకూ లేకుండా ట్రాఫిక్ పోలీసుల ఫొటోలకు ఫోజులిచ్చింది. కూకట్‌పల్లి, నిజాంపేట వద్ద విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు రెండు రోజులు కిందట బైక్‌పై సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ వెళుతున్న యువతి కనిపించింది. వెంటనే కానిస్టేబుల్ ఫొటో తీయగా చలాన్ నమోదైంది. వరుసగా అదే విధంగా రోజు వాహనం నడపగా పోలీసులు చలాన్లు విధించారు. ఆమె ఉల్లంఘనలపై దృష్టి పెట్టిన పోలీసులు వాహనంపై 22 చలాన్లు ఉన్నట్లు గుర్తించారు.

woman caught driving cell phone in Nizampet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News