Tuesday, January 21, 2025

మహానగరం ఢిల్లీ బావానాలో ఆటవికం

- Advertisement -
- Advertisement -

Woman Chased, Stabbed To Death In Front Of Her Children

పిల్లలతో పరుగులు తీసిన యువతిని వేటాడి నరికేశాడు

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో గురువారం రాత్రి భయానక దారుణ ఘటన జరిగింది. రాక్షసుడుగా మారిన ఓ వ్యక్తి చేతిలో పదునైన కత్తిపట్టుకుని చేతుల్లో బిడ్డ పక్కన ఓ బాబుతో ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీస్తూ ఉన్న యువతిని వెంబడించి మరీ దారుణంగా నరికి చంపేశాడు. ఔటర్ ఢిల్లీలోని బావానా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఆ యువతి ఎత్తుకున్న పసిపాప కింద పడి బిగ్గరగా ఏడ్చింది. పక్కన ఉన్న బాబు కేకలు పెట్టాడు. అయితే ఇవేవీ ఆ వ్యక్తిని కదిలించలేకపొయ్యాయి. వారి కళ్ల ముందే ఆ యువతిని చంపేశాడు. ఎవరికి చిక్కకుండా తప్పించుకున్నాడని పోలీసులు శుక్రవారం తెలిపారు. యువతి శవంపై పలు కత్తిపోట్లు ఉన్నాయి. నెత్తురు వెల్లువెత్తుతుంది. ఆ ప్రాంతంలో ఉన్న సిసిటీవీ ఫుటేజ్ దృశ్యాలలో ఈ యువతిని వెంబడించిన యువకుడు ప్రాణభీతితో పరుగులు తీస్తున్న యువతి గుక్కతిప్పుకోకుండా ఉన్న పసిపాపల దీనస్థితి తెలిపే దృశ్యాలు కన్పించాయి.

దుండగుడి ముఖం అస్పష్టంగా కనబడింది. ఘటన జరగుతున్నట్లు తెలియగానే తాము వాహనాలలో అక్కడికి చేరామని ఈలోగానే దారుణం జరిగిందని, వెంటనే కుప్పకూలి ఉన్న యువతిని ఆసుపత్రికి చికిత్సకు తరలించామని కానీ ఆమె అప్పటికే చనిపోయి ఉన్నట్లు డాక్టర్లు నిర్థారించారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన తరువాత పోలీసులు ప్రాధమిక దర్యాప్తు జరిపారు. ఈ క్రమంలో యువతి ఈ వ్యక్తి ఇరుగుపొరుగువారుగా ఉండేవారని తరువాత ఆమె వేరే చోటుకు వెళ్లిందని వెల్లడయింది. శనివారం పోలీసుల గాలింపులో హంతకుడు దొరికాడు. తామిద్దరమూ ప్రేమించుకున్నామని తరువాత ఆమె వదిలిపెట్టి వెళ్లిందని, దీనితో కోపం పెంచుకుని తాను చంపేశానని నిర్లజ్జగా చెప్పాడు. ఇంతకు ఈ పిల్లలు ఎవరనేది పోలీసులు వెల్లడించలేదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News