Thursday, December 19, 2024

దొంగలను తరిమికొట్టిన మహిళ…

- Advertisement -
- Advertisement -

Woman chases away thieves in visakhapatnam

విశాఖపట్నం: ఓ మహిళ మంగళవారం రాత్రి తన ఇంట్లోకి ప్రవేశించిన నలుగురు దొంగలను తరిమికొట్టింది. ఈ ఘటన విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గం చీమలపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రిటైర్డ్ ఉద్యోగి ఆళ్ల అప్పారావు తన భార్య లలిత కుమారి, ఇద్దరు కుమారులు చెరువుగట్టు సమీపంలో నివసిస్తున్నారు. ఆయన కుమారుడు అవినాష్‌కి లావణ్యతో ఇటీవల వివాహం జరిగింది. మంగళవారం రాత్రి అవినాష్ డ్యూటీకి వెళ్లాడు. కుటుంబ సభ్యులంతా ఓ గదిలో, లావణ్య మరో గదిలో నిద్రిస్తున్నారు. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో దొంగలు కిటికీ గ్రిల్ తొలగించి ఇంట్లోకి ప్రవేశించారు. కుటుంబసభ్యులు నిద్రిస్తున్న ఆరుబయట గదికి బోల్ట్ వేసి లావణ్య గది తలుపులు పగులగొట్టి వస్తువులను దొంగిలించేందుకు ప్రయత్నించారు. డోర్ పగలగొట్టిన శబ్దానికి లావణ్య లేచింది. ఆమె వారిని ఆపడానికి ప్రయత్నించింది. దుండగులు ఆమెను పలుచోట్ల కత్తితో పొడిచి పరారయ్యారు. రక్తస్రావమైన గాయాలతో లావణ్య తన అత్తమామల గది తలుపులు తెరిచింది. ప్రస్తుతం ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇంటిని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News