Wednesday, January 22, 2025

షాకింగ్ వీడియో: పెళ్లి ఊరేగింపులో డ్యాన్స్ చేస్తూ మహిళ మృతి

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని అల్లిపురంలో పెళ్లి ఊరేగింపులో ఓ మహిళ డ్యాన్స్ చేస్తూ హఠాత్తుగా కుప్పకూలి మృతిచెందిన విషాద సంఘటన చోటుచేసుకుంది. రాణి అనే మహిళను గమనించిన వారు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు ఆమె అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. రాణికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని, దాని ఫలితంగా ఆమె ప్రాణాలు కోల్పోయిందని కుటుంబీకులు తెలిపారు. ఈ ఘటన పెళ్లికి వచ్చిన అతిథులను దిగ్భ్రాంతికి గురి చేసింది. రాణి ఆకస్మిక మరణంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు రోదిస్తున్నారు. మృతురాలికి నివాళిగా వివాహ ఊరేగింపును నిలిపివేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News