Saturday, March 15, 2025

వరకట్న వేధింపులు… మహిళ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలోని అత్తాపూర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. వరకట్న వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. కర్ణాటకకు చెందిన స్వప్న(27)కు అత్తాపూర్‌కి చెందిన పాండురంగకు2020లో వివాహం జరిగింది. కొద్ది రోజులుగా స్వప్నను అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు. ప్రతిసారి ఇంట్లో నుంచి డబ్బులు తేలేక.. వేధింపులు తట్టుకోలేకపోయింది స్వప్న. దీంతో శుక్రవారం ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News