Thursday, December 26, 2024

దంపతులకు కౌన్సెలింగ్‌… పెట్రోల్‌ పోసుకుని భార్య ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Woman commits suicide by pouring petrol in AP

విశాఖపట్నం: విశాఖపట్నంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో గురువారం ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరుకు చెందిన శ్రావణి(30)కి నాలుగు నెలల క్రితం వైజాగ్‌కు చెందిన వినయ్‌తో వివాహమైంది. మొదటి నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండడంతో శ్రావణి బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కౌన్సెలింగ్ కోసం గురువారం ఉదయం పోలీస్ స్టేషన్‌కు రావాలని పోలీసులు కోరారు. ఎస్‌ఐ శ్రీనివాస్ దంపతులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. శ్రావణి ఫోన్ మాట్లాడుకుంటూ బయటకు వెళ్లి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. పోలీసులు అప్రమత్తమై మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో ఎస్‌ఐ శ్రీనివాస్‌ చేతికి గాయాలయ్యాయి. తీవ్ర గాయాలపాలైన శ్రావణిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించి భర్తను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News