Sunday, January 19, 2025

షాపింగ్‌కు తీసుకెళ్లలేదని వివాహిత ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Woman tries to commit suicide in Quthbullapur

కుత్బుల్లాపూర్: భర్త షాపింగ్‌కు తీసుకెళ్ళలేదని ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. గాజులరామారం మెట్‌కాన్‌గూడ ప్రాంతానికి చెందిన మహేష్ బోరబండ స్నేహపూరికాలనీకి చెందిన శిరీష (23)తో రెండు సంవత్సరాల క్రితం ప్రేమించి వివాహం జరిగింది. వీరికి సంవత్సరంన్నర పాప ఉంది. అయితే శనివారం భార్య షాపింగ్‌కు తీసుకెళ్ళమని అడుగగా భర్త నిరాకరించాడు. ఇద్దరి మధ్య గొడవ జరగడంతో మనస్తాపానికి గురైన శీరిష ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుం ది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News