- Advertisement -
కుటుంబ కలహాలతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…సబితారాయ్‌కి భర్తతో గత కొంత కాలం నుంచి గొడవలు జరుగుతున్నాయి. రోజు ఇంట్లో గొడవలు జరుగుతుండడంతో విరక్తి చెందిన బాధితురాలు భర్త ఇంట్లో లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకుని సంఘటన స్థలానికి చేరుకున్న నార్సింగి పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
- Advertisement -