Tuesday, March 4, 2025

మెట్రో స్టేషన్ పై నుంచి దూకి వృద్ధురాలు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్ ‌: హైదరాబాద్‌లోని ఎర్రగడ్డలో విషాదం చోటుచేసుకున్నది. ఎర్రగడ్డ పరిధిలో గల మెట్రో స్టేషన్ పై నుంచి దూకి వృద్ధురాలు ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతి చెందిన వృద్ధురాలు మారెమ్మగా (70) గుర్తించారు. ఆమె స్వస్థలం మహబూబ్‌నగర్‌ జిల్లా మక్తల్‌ అని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News