Wednesday, January 22, 2025

బిగ్ బాస్ లో అవకాశం ఇప్పిస్తానని మోసం.. పోలీసులకు యువతి ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయిన ప్రముఖ రియాల్టీ షో బిగ్ బాస్ లో అవకాశం వస్తుందని ఆశపడి ఓ యువతి మోసపోయయింది. దీంతో బాదితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి.. తాను మాటీవీలో ప్రొడక్షన్ ఇంఛార్జ్ గా పనిచేస్తున్నానని చెప్పి… స్వప్న అనే యువతితో పరిచయం పెంచుకున్నాడు. తర్వాత మాయమాటలు చెప్పి ఆమెను మోసం చేశాడు.

బిగ్ బాస్ షోలో అవకాశం ఇప్పిస్తాని నమ్మించి దాదాపు రూ.2.5 లక్షలు తీసుకుని తనను మోసం చేశాడని సదరు యువతి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News