Monday, December 23, 2024

మహిళపై పోలీసు బ్రదర్స్ సామూహిక అత్యాచారం..

- Advertisement -
- Advertisement -

పిలిభిత్: ఉత్తర్ ప్రదేశ్‌లోని పిలిభిత్‌లో పనిచేస్తున్న ఒక కానిస్టేబుల్, షామ్లి జిల్లాలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అతని అన్న నెలల తరబడి ఒక మహిళను బంధించి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
షామ్లిలో నివసించే ఒక మహిళకు 2021 మార్చిలో ఫేస్‌బుక్ ద్వారా ఇమ్రాన్ మీర్జా అనే 30 ఏళ్ల పోలీసు కానిస్టేబుల్ పరిచయమయ్యాడు. పెళ్లి చేసుకుందామని ఆమెను నమ్మించిన ఇమ్రాన్ వివిధ ప్రదేశాలకు తీసుకువెళ్లి అక్కడి హోటల్స్‌లో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇటీవల తన స్వస్థలం పిలిభిత్‌లో ఒక అద్దె ఫ్లాట్‌లో ఆమెను ఇమ్రాన్ ఉంచాడు. అక్కడే పనిచేస్తున్న ఇమ్రాన్ సోదరుడైన ఫర్ఖాన్ కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

తాను రెండుసార్లు గర్భం దాల్చానని, అయితే ఇమ్రాన్ తనకు బలవంతంగా అబార్షన్ చేయించాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె ఆరోపించింది. తాను రెండేళ్లపాటు ఇమ్రాన్ ప్టెట్టిన చిత్రహింసలను భరించానని, తనను దారుణంగా కొట్టేవాడని, ఇక భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేశానని ఆమె తెలిపారు. కేసు ఉపసంహరించుకోవాలని, లేకుంటే చంపేస్తామని ఆ ఇద్దరు సోదరులు తనను బెదిరించినట్లు ఆమె ఆరోపించారు.

కాగా..బాధితురాలు వేరే మతానికి చెందిన వ్యక్తని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పిలిభిత్ ఎస్‌పి అతుల్ శర్మ విలేకరులకు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఇమ్రాన్ దీర్ఘకాలిక సెలవులో ఉన్నాడని, మే 3న అతను తిరిగి విధులలో చేరాల్సి ఉందని ఎస్‌పి చెప్పారు. అతనిపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News