Saturday, December 21, 2024

అనుమానాస్పద స్థితిలో మహిళా కానిస్టేబుల్ మృతి

- Advertisement -
- Advertisement -

వరంగల్ కార్పొరేషన్: నగరంలోని పోచమ్మమైదాన్ వేణురావుకాలనీలో నివాసం ఉంటున్న మహిళా కానిస్టేబుల్ ఎదులాపురం మౌనిక ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీస్‌లు, తల్లిదండ్రులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ప్రస్తుతం వేణురావుకాలనీలో నివాసం ఉంటున్న మౌనిక మహబూబాబాద్ డిసిపి కార్యాలయంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తుంది. ఇటీవల తన భర్త శ్రీధర్ తరుచూ వేధిస్తున్నట్లు మౌనిక చెప్పిందని తల్లిదండ్రులు తెలిపారు.

ఇందులో భాగంగానే ఆదివారం మౌనిక ఉరివేసుకొని మృతి చెందినట్లు అల్లుడు శ్రీధర్ చెప్పాడని కానీ మౌనిక భర్త తీవ్రంగా కొట్టడంతో తమ కూతురు మృతి చెందిందని, మౌనిక ఒంటిపై కూడా గాయాలు ఉన్నాయని కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మట్టెవాడ పోలీస్‌స్టేషన్‌లో మౌనిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా శ్రీధర్‌పై కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని ఎంజిఎం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు మట్టెవాడ పోలీసులు తెలిపారు. మృతి చెందిన మౌనికకు కూతురు, కుమారుడు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News