Friday, January 10, 2025

మహిళా కానిస్టేబుల్ పరువు హత్య

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ఇబ్రహీంపట్నం : రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంప ట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళా కానిస్టేబుల్ దారుణ హత్యకు గు రైంది. కులాంతర వివాహం చేసుకున్నందుకు, పరువు కోసం సొం త అక్కనే తమ్ముడు కడతేర్చాడు. తానే తన అక్కను హతమార్చానని అంగీకరిస్తూ నిందితుడు పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. సంచలనం సృష్టించిన ఈ సంఘటనకు సంబంధించి సిఐ సత్యనారాయణ సోమవారం తెలిపిన పూర్తి వివరాలు ఇలావున్నాయి. రాయపోల్ గ్రామంలో కుర్మ కులానికి చెం దిన కొంగర పద్మ, మైసయ్య దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. పెద్ద కుమార్తె వివాహమైంది. రెండవ కుమార్తె నాగమణి 2021లో కానిస్టేబుల్‌గా ఎంపికైంది. గతంలోనే రాయపోల్‌లో అదే కులానికి చెందిన యువకుడితో ఆమెకు పెళ్లి జరిగింది. అయితే, అతను వికలాంగుడు కావడంతో సంసారం సాఫీగా చేయక ఏడాది క్రితం మొదటి భర్త నుంచి ఆమె విడాకులు తీసుకుంది.

తన క్లాస్‌మేట్, గత రెండుమూడేళ్ల నుంచి ప్రేమిస్తున్న తన సొంత ఊర్లోని బేగరి కులానికి బండారి శ్రీకాంత్‌ను గత నెల 10న యాదగిరిగుట్ట వద్ద వివాహం చేసుకుంది. అప్పటి నుండి హయత్‌నగర్‌లో ఉంటున్నారు. ఆదివారం సెలవు కావడంతో రాయపోల్‌లోని అతని తమ్ముడు పరమేష్ వద్దకు ఆమె వచ్చింది. తల్లిదండ్రులు సంపాదించిన భూమిని తన పేరిట చేయాలని అక్క నాగమణిని పరమేష్ కోరగా ఆమె నివారించింది. దీనిని మనసులో పెట్టుకున్న తమ్ముడు భూమి విషయంలో తన పేరు మీద చేయడానికి నిరాకరించడంతో అక్కపై ప్రతీకారం తీర్చుకోవాలని ప్లాన్ చేశాడు. అందులో భాగంగానే సోమవారం ఉదయం 8.30 గంటల సమయంలో రాయపోల్ నుండి మాన్యగూడం మీదుగా హయత్‌నగర్‌కు స్కూటీపై ఆమె వెళుతున్న క్రమంలో పరమేష్ వెనుక నుండి కారులో వచ్చి నేరుగా ఢీకొనడంతో కింద పడిపోయింది. వెంట తెచ్చుకున్న వేటకొడవలితో ఆమె మెడపై దాడి చేయగా అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. అనంతరం నిందితుడు నేరుగా పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. కాగా, మృతదేహాన్ని పోలీస్ స్టేషన్‌కు తీసుకురావడంతో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది.

దళిత సంఘాల ఆధ్వర్యంలో సాగర్ రహదారిపై బైఠాయింపు
పరువు హత్య కేసులో నిందితుడిని కఠినంగా శిక్షించాలని దళిత సంఘాల నాయకులు భర్తాకి రాజు, సిహెచ్ జంగయ్య ఆవులు మల్లేష్, కెవిపిఎస్ జిల్లా నాయకుడు బి.సామెల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం పోలీస్ స్టేషన్ ఎదురుగా సాగర్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పరువు హత్యలు జరుగకకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కానిస్టేబుల్ నాగమణి భర్త శ్రీకాంత్‌కు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు మరోసారి జరుగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు తరంగ్ , శ్రీకాంత్, వంశీ, వినయ్, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News