Wednesday, January 22, 2025

మహిళా కానిస్టేబుల్ పై ఎస్ఐ అత్యాచారం…..

- Advertisement -
- Advertisement -

Woman constable raped by cop in UP

 

లక్నో: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మహిళా కానిస్టేబుల్‌పై ఎస్‌ఐ అత్యాచారం చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని బండా ప్రాంతంలో జరిగింది. 70 రోజుల తరువాత సదరు ఎస్‌ఐ కోర్టులో లొంగిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బాబేరు పోలీస్ స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్, ఎస్‌ఐ పని చేస్తున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను పలుమార్లు లొంగదీసుకున్నాడు. ఆమెకు తెలియకుండా మరో అమ్మాయిని రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఆమె అతడిని నిలదీయడంతో చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఆమె స్థానిక ఎస్‌పికి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి విచారణ చేయగా అతడే నిందితుడిని ప్రాథమిక విచారణలో తేలింది. 70 రోజుల తరువాత కోర్టు ముందు ఎస్‌ఐ లొంగిపోయాడు. అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని పోలీస్ ఉన్నతాధికారి తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News