లక్నో: మహిళా కానిస్టేబుల్‌పై ఆమె మామ అత్యాచారం చేయడంతో భర్తకు ఈ విషయం చెప్పడంతో అతడు ఆమెకు ట్రిపుల్ తలాక్ చెప్పిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నజీర్ అహ్మద్ అనే వ్యక్తి పిఎసిలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. అతడి కుమారుడు అబిడ్ ఓ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. మూడు సంవత్సరాల క్రితం ఓ మహిళా కానిస్టేబుల్‌ను అబిడ్ను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి వరకట్నం కావాలని ఆమెను వేధించేవాడు. భర్త లేని సమయంలో మామ నజీర్ అహ్మద్ ఆమెపై అత్యాచారం చేశాడు. దీంతో ఆమె తన భర్తకు ఈ విషయం చెప్పడంతో అవసరం లేదని ఆమెకు ట్రిపుల్ తలాక్ అని చెప్పాడు. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్లో భర్త, మామపై సదరు మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు చేసింది. ఎస్పి వినిత్ భట్నాగర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
మహిళా కానిస్టేబుల్ పై మామ అత్యాచారం… భర్త ట్రిపుల్ తలాక్
- Advertisement -
- Advertisement -
- Advertisement -