Friday, December 27, 2024

కామారెడ్డిలో మిస్టరీగా మారిన ముగ్గురి ఆత్మహత్యలు

- Advertisement -
- Advertisement -

భిక్కనూర్ ఎస్‌ఐతో పాటు మహిళా కానిస్టేబుల్, సింగిల్ విండో జూనియర్ అసిస్టెంట్ ఆత్మహత్య
వివాహేతర సంబంధమా.. లేదా ఒకరిని రక్షించబోయి మరొకరు మృతి చెందారా?
పోస్టుమార్టం ఆధారంగా వెల్లడిస్తామన్న ఎస్‌పి

తమ కూతురిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని మహిళా కానిస్టేబుల్ శృతి తల్లి ఆరోపణ
తమ తమ్ముడిని అనవసరంగా ఇరికించి హత్య చేశారని సింగిల్ విండో ఆపరేటర్ అన్న ఆరోపణ
రక్షించబోయి మృతి చెందాడని అంటున్న ఎస్‌ఐ చిన్నాన్న
నిగ్గు తేలని ముగ్గురి ఆత్మహత్యల మిస్టరీ

ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్, సింగిల్ విండో కార్యాలయంలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ ముగ్గురు ఒకేసారి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. కామారెడ్డి జిల్లా, సదాశివనగర్ మండలం, అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్ద చెరువులో బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. భిక్కనూర్ ఎస్‌ఐగా పనిచేస్తున్న సాయికుమార్, బీబీపేట పోలీస్‌స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న శృతి, బీబీపేట సింగిల్ విండో కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కిరణ్ కుమార్ మృతి చెందారు. పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగానే వివరాలు వెల్లడిస్తామని జిల్లా ఎస్‌పి సింధుశర్మ వెల్లడించడంతో ముగ్గురి ఆత్మహత్య సంఘటనపై చిక్కుముడి వీడలేదు. వివరాల్లోకి వెళ్తే…మెదక్ జిల్లా, కొల్చారంనకు చెందిన ఆంజయ్య, శంకరమ్మకు ఇద్దరు సంతానం, కాగా మొదటి సంతానం సాయికుమార్, రెండవ సంతానం కూతురు భవాని ప్రస్తుతం కామారెడ్డిలోని ఓ ప్రవేట్ కళాశాలలో పిజి చదువుతోంది.

వ్యవసాయ కుటుంబానికి చెందిన సాయికుమార్ బీటెక్ చేసిన అనంతరం 2018లో మూడు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నతాధికారి ఉద్యోగంతో పాటు స్పెషల్ పార్టీ కానిస్టేబుల్‌తో పాటు ఎస్‌ఐ జాబ్‌ను జనరల్ కేటగిరిలో పొందాడు. మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన సాయికుమార్‌కు ఆర్థిక ఇబ్బందులు ఏమీలేవు. అయితే మహాలక్ష్మి అనే యువతిని పెండ్లాడిన సాయికుమార్‌కు మూడేళ్ల వయసు గల కుమారుడు శ్రేయన్ ఉండగా ప్రస్తుతం అతని భార్య గర్భవతితో ఉంది. బుధవారం ఉదయం 11ః30 గంటలకు విధులు నిర్వహిస్తున్న సాయికుమార్ అత్యవసర పని ఉందని ఇంటికి వెళ్లి సాయంత్రంలోగా వస్తానని చెప్పాడు. అప్పటి నుంచి అతని ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామ ప్రాంతంలో ఎస్‌ఐ సాయికుమార్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

ఇదిలావుండగా బీబీపేటలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న శృతిది గాంధారి మండలం, గుర్జాల్ గ్రామం. ఆమె తండ్రి కమ్మరి పుండరీకం, తల్లి విజయతో పాటు చెల్లలు శ్వేత, తమ్ముడు నవీన్‌తో కలిసి గాంధారిలో గత ఆరేళ్ల నుంచి నివాసం ఉంటోంది.. శృతికి గత ఐదు సంవత్సరాల క్రితం పెండ్లి కాగా విడాకులు తీసుకుంది. ఆమె పోలీస్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిసూ గాంధారికి వెళ్తి వస్తుండేది. మంగళవారం డ్యూటీకి వచ్చిన శృతి బుధవారం ఇంటికి వెళ్లకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News