Friday, January 17, 2025

గురుద్వారాలో మద్యం మహిళ కాల్చివేత..

- Advertisement -
- Advertisement -

పాటియాలా: పంజాబ్‌లో ఓ గురుద్వారా ఆవరణలో మద్యం సేవించిందని ఓ మహిళను కాల్చిచంపారు. ఈ విషయాన్ని సోమవారం పోలీసులు తెలిపారు. ఆదివారం పాటియాలాలోని దుఖ్ నివారణ్ సాహిబ్ గురుద్వారా వెలుపలి కోనేరు వద్ద కూర్చొని 30 సంవత్సరాల మహిళ పర్వీందర్ కౌర్ తాగుతూ కన్పించడంతో అక్కడికి ప్రతిరోజూ వచ్చే సిక్కు భక్తుడు నిర్మల్‌జిత్ సింగ్ సైనీ తనవద్ద ఉన్న లైసెన్స్ రివాల్వర్‌తో పలుసార్లు తూటాలు పేల్చినట్లు, ఈ క్రమంలో మహిళ చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.

సైనీకి ఎటువంటి గత నేర చరిత్ర లేదని, తాను నిత్యం వచ్చే సిక్కుల పవిత్రక్షేత్రం అపవిత్రం కావడం చూసి సహించలేకనే ఈ విధంగా దారుణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు తెలిపారు. మహిళ అక్కడికక్కడనే చనిపోగా, అటుగా వెళ్లుతున్న ఓ వ్యక్తికి గాయాలు అయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News