Friday, January 24, 2025

పిచ్చిభక్తి… నాలుక కోసేసి… అమ్మవారి పాదాలపైకి విసిరిన యువతి

- Advertisement -
- Advertisement -

Woman cut her tongue in Madhya Pradesh

 

భోపాల్: రోజు రోజుకు భక్తులలో ముఢనమ్మకాలు ఎక్కువగా పెరుగుతున్నాయి. అమ్మవారికి బలి ఇవ్వాలనే తాపత్రయంతో ఓ యువతి తన నాలుక కోసి అమ్మవారి పాదాల చెంతకు విసిరేసిన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం సిధీ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బడా గ్రామంలో రాజకుమారీ పటేల్ (20) అనే యువతి తన తల్లిదండ్రులతో కలిసి జీవిస్తోంది. ఆమెకు దేవుడి మీద భక్తి ఎక్కువగా ఉండేది. తన తల్లిదండ్రులతో కలిసి గ్రామంలో అమ్మవారి దేవాలయానికి వెళ్లింది. పూజ చేస్తుండగా సదరు యువతి నాలుకను రెండు భాగాలుగా కోసి దేవుడి పాదాలపైకి విసిరింది. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు వైద్య సిబ్బందితో గ్రామానికి చేరుకొని ప్రాథమిక చికిత్స చేసి మరో ఆస్పత్రికి తరలించారు. దేవతకు బలి ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆ యువతి ఇలా చేసిందని పోలీసులు వెల్లడించారు. భక్తి ఉండాలి కాని పిచ్చి భక్తి ఉండొద్దని గ్రామస్థులు వాపోతున్నారు. బలి పేరుతో దేశంలో మానవ బలులు ఇస్తున్న దృశ్యాలు చూస్తూనే ఉన్నాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News