Wednesday, January 22, 2025

మూసారంబాగ్ బ్రిడ్జి వద్ద మహిళ మృతదేహం లభ్యం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మూసారంబాగ్ బ్రిడ్జి వద్ద ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. బుధవారం ఉదయం ముసీనదిలో కొట్టుకొని వచ్చి ముసరాంబాగ్ బ్రిడ్జ్ వద్ద ఆగిన మహిళా మృతదేహాన్ని జిహెచ్ఎంసి జెసిబి డ్రైవర్ గుర్తించి అధికారులకు తెలియజేశాడు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, జిహెచ్ఎంసి అధికారులు మహిళా మృతదేహాన్ని బయటికి తీసి, నాలుగు రోజుల క్రితం గాంధీనగర్ హుసేన్ సాగర్ నాలాలో గల్లంతు అయిన లక్ష్మీగా గుర్తించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం లక్ష్మీ మృతదేహాన్ని పోలీసులు గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.

కాగా, నిన్న ఆరేళ్ల బాలుడు నాలాలో పడి కొట్టుకుపోయి మృతి చెందిన విషయం తెలిసిందే. నగరంలో ప్రతేడాది వర్షాకాల సమయంలో నాలాల్లో పడి పిల్లులు కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, రెండు రోజులుగా భారీ వర్షాలు కురవడంతో హైదరాబాద్ లో నాలాలు పొంగి ప్రవహిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి వరద నీరు చేరుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News