Wednesday, January 22, 2025

నానక్ రామ్ గూడలో దారుణం.. మహిళపై అత్యాచారం, హత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నానక్ రామ్ గూడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో కుళ్లిన స్థితిలో ఉన్న గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. మహిళను అత్యాచారం చేసి తర్వాత హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

తుక్కు సామాగ్రి తెచ్చుకునేందుకు భవనంలోకి వెళ్లిన మహిళను కొందరు దుండగులు బండరాయితో కొట్టి చంపినట్లు తెలుస్తోంది. మృతురాలిని గౌలిదొడ్డి, కేశవనగర్ వడ్డెర బస్తీకి చెందిన కాశమ్మగా పోలీసులు గుర్తించారు. ఈ నెల 25 నుంచి మహిళ కనిపించట్లేదని మిస్సింగ్ కేసు నమోదైనట్లు సమాచారం. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News