Monday, December 23, 2024

యుపి పోలీసులతో ఘర్షణ… మహిళ మృతి

- Advertisement -
- Advertisement -

Woman died after Clash with UP Police

మొరాదాబాద్/డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌కు వచ్చిన ఉత్తరప్రదేశ్ పోలీసు బృందానికి భరత్‌పూర్ గ్రామస్తులకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ దశలో అక్కడి బిజెపి నేత భార్య మృతి చెందారు. ఐదుగురు గాయపడ్డారు. అక్రమ ఇసుక తవ్వకాల కేసులో నిందితుడు అయిన ఓ వ్యక్తిని అరెస్టు చేసేందుకు యుపి పోలీసు బృందం ఉద్ధమ్ సింగ్ నగర్ జిల్లాలోని కాశీపూర్ వద్ద ఉన్న భరత్‌పూర్ గ్రామానికి వచ్చింది. నిందితుడును అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీసు బృందంపై స్థానికులు దాడికి దిగారు. పోలీసులు, స్థానికుల మధ్య కుమ్ములాటలు జరిగాయి. ఈ క్రమంలో కాల్పుల మోతలు విన్పించాయి. పోలీసు కాల్పుల్లోనే అక్కడి బిజెపి నేత భార్య చనిపోయిందని ఎఫ్‌ఐఆర్ దాఖలు అయింది. ఘటనలో గాయపడ్డ వారిలో నలుగురు పోలీసులు కూడా ఉన్నారు.

Woman died after Clash with UP Police

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News