Thursday, December 26, 2024

పిల్లిని కాపాడబోయి బావిలో పడి మహిళ మృతి..

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి : బావిలో పడిన పిల్లిని కాపాడబోయి మహిళ మృతి చెందిన సంఘటన పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం కిష్టంపల్లెలో సోమవారం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. స్థానికులు, పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..కిష్టంపల్లె గ్రామంలో నివసించే లింగాల లసుమ ఇంట్లో పిల్లిని పెంచుకుంటుంది. కాగా సోమవారం తెల్లవారు జామున పిల్లి ఇంటి సమీపంలో గల చేదబావిలో పడింది.

తెల్లారిక లేచిన లసుమ పిల్లి కనపడక పోవడంతో చుట్టు పక్కల వెతకగా బావి నుంచి పిల్లి అరుపులు వినిపించాయి. దీంతో ఆమె బొక్కెన సాయంతో పిల్లిని బయటకు తీసేందుకు ప్రయత్నింస్తుండగా ప్రమాదవశాత్తు బావిలో పడిపోయింది.ఇది గమనించిన ఆమె చిన్న కుమారుడు స్థానికుల సాయంతో బయటకు తీసుకొచ్చారు. అయితే ఆమె అప్పటికే మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News