Monday, December 23, 2024

కుటుంబ కలహాలతో అత్తను చంపిన అల్లుడు..

- Advertisement -
- Advertisement -

 

జ్యోతినగర్: కుటుంబ కలహాలతో అత్త లక్ష్మి(68)ని అల్లుడు కాసు సతీష్ కొట్టడతో తీవ్రంగా గాయపడి ఆమెను గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ మేరకు ఎన్టీపీసీ ఎస్‌ఐ జీవన్ తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం స్థానిక క్రిష్ణానగర్‌లో నివాసం ఉంటున్న బైక్ మెకానిక్ కాసం సతీష్ భార్య, భర్తల మధ్య గత కొద్ది నెలల నుంచి వివాదం జరుగుతుందని అన్నారు. విషయం తెలుసుకోవడం కోసం ఇంటికి వచ్చిన అత్త లక్ష్మిని అల్లుడు సతీష్ చేతులతో బలంగా కొట్టడంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయని తెలిపారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందిందని తెలిపారు.

నిందితుని భార్య పద్మ అదృశ్యం కేసు…
సతీష్ భార్య కాసం పద్మ గురువారం ఉదయమే ఇంటి నుంచి వెళ్లిపోయిందని ఆమె కూతరు కాసు శృతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు అదృశ్యమైనట్లు ఎన్టీపీసీ ఎస్‌ఐ జీవన్ కేసు నమోదు చేసుకున్నారు. గత ఐదు నెలల నుంచి పద్మ భర్త సతీష్ పిల్లలను పట్టించుకోకుండా ఇంటికి రావడం లేదని, ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు కూతురు శృతి పోలీసులకు ఫిర్యాదులో పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News