Sunday, December 22, 2024

మహిళపై అత్యాచారం.. రక్తస్రావంతో మృతి చెందిన మహిళ

- Advertisement -
- Advertisement -

గుర్తు తెలియని మహిళపై అత్యాచారం, హత్య చేసిన సంఘటన కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… ఓ మహిళ మృతదేహం కూకట్‌పల్లి వై జంక్షన్ వద్ద ఉన్న ఏఆర్ పైప్ వర్క్‌షాపు సెల్లార్‌లో పడి ఉండడాన్ని స్థానికులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళ మృతదేహం రక్తంలో ఉండడంతో, అత్యాచారం చేయడం వల్ల తీవ్ర రక్తస్రావమై మృతిచెందినట్లు పోలీసులు గుర్తించారు. దర్యాప్తు చేసిన పోలీసులు అత్యాచారానికి గురై మృతిచెందిన మహిళ మూసాపేటకు చెందిన సుజాత(45) గా గుర్తించారు.

మృతిచెందిన మహిళ కూలీ పనిచేస్తూ కల్లు తాగుతూ తిరిగేదని తెలిసింది. మృతురాలికి భర్త, పిల్లలు లేనట్లు పోలీసుల విచారణలో తెలిసింది. వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చుట్టుపక్కల ఉన్న సిసి కెమెరాలను పరిశీలించారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు మహిళను బిల్డింగ్ సెల్లార్‌లోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు గుర్తించారు. నిందితులు ఇద్దరు బైక్‌పై వచ్చి మహిళపై అత్యాచారం చేసినట్లు గుర్తించారు. బైక్ నంబర్ ఆధారంగా పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. మృత దేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News