Monday, December 23, 2024

మొయినాబాద్ లో బస్సు-బైక్ ఢీకొని మహిళ మృతి..

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: జిల్లాలోని మొయినాబాద్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని అజిత్ నగర్ గేటు దగ్గర బస్సు-బైకు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, సిసి కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆదారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News