Friday, December 27, 2024

అనుమానస్పద స్థితిలో మహిళ మృతి

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః అనుమానస్పదస్థితిలో ఓ మహిళ మృతిచెందిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యూసుఫ్‌గూడ జనకమ్మ తోటలో చోటుచేసుకుంది. మహిళ మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉండగా చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల కథనం ప్రకారం…బేగంపేటకు చెందిన కవిత, భర్త రౌడీషీటర్. ఇటీవలే ఓ కేసులో కవిత భర్తను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఒంటరిగా కవిత ఇంటి వద్ద ఉంటోంది. కల్తుతాగే అలవాటు ఉన్న కవిత రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయటికి వచ్చి ఎవరికీ కన్పించలేదు.

దీంతో కుటుంబ సభ్యులు బేగంపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే యూసుఫ్‌గూడ సమీపంలో మహిళ మృతిచెంది ఉండగా ఫొటోలను బేగంపేట పోలీసులు కుటుంబ సభ్యులకు చూపించగా వారు గుర్తించారు. కవిత ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని, వడ దెబ్బ లేదా మద్యం అధికంగా తాగడం వల్ల మృతిచెంద వచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పోలీసులు మృతదేహాన్ని పొస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News