Tuesday, January 21, 2025

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

- Advertisement -
- Advertisement -

కడ్తాల్ : మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంఘటన కడ్తాల మండలం కర్కల్ పహాడ్ గ్రామ శివారులోని ఎస్‌ఎస్ ఫామ్ హౌస్‌లో చోటుచేసుకుంది. కడ్తాల ఎస్‌ఐ హరీష్‌శంకర్‌గౌడ్ తెలిపిన కథనం ప్రకారం నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం తుంగతుర్తి గ్రామానికి చెందిన వల్లభుదాసు స్వరూప శ్రీనివాస్ దంపతులు కడ్తాల మండలం కర్కల్ పహాడ్ గ్రామ శివారులోని ఎస్‌ఎస్ ఫామ్‌హౌస్‌లో గత కోన్ని నెలలుగా ఇద్దరు కుమారులతో కలిసి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. స్వరూప పెళ్లి నాటి నుండి శ్రీనివాస్ బాగా మద్యం తాగుతూ భార్యను వేధిస్తూ ఉండేవాడు.

శ్రీనివాస్ ప్రవర్తనపై గతంలో పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడినా ఎలాంటి మార్పు రాలేదు. ఆదివారం శ్రీనివాస్ భార్యతో గొడవపడి వెళ్లిపోయినట్లు ఎస్‌ఐ తెలిపారు. సోమవారం ఉదయం స్వరూప (40) అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండడంతో కుమారుడు వెంకటేష్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం స్వరూప మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మా అమ్మ మృతిలో నాన్న శ్రీనివాస్‌పై అనుమానం ఉన్నట్లు కుమారుడు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ హరీష్‌శంకర్‌గౌడ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News