Wednesday, January 22, 2025

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

- Advertisement -
- Advertisement -

మక్తల్ : మక్తల్ పట్టణంలోని యాదవనగర్‌కు చెందిన కావలి లక్ష్మీ(45) అనే మహిళ, పట్టణ శివారు కాటన్‌మిల్ సమీపంలోని భీమా ప్రధాన కాలువ వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. శనివారం రాత్రి గుర్తు తెలియన మహిళ మృతదేహం ఉన్నట్లు చుట్టు పక్కల రైతులు పోలీసులకు సమాచారం అందించడంతో, పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. అయితే ఆదివారం ఉదయం యాదవనగర్‌కు చెందిన కావలి లక్ష్మప్ప మృతురాలిని తన భార్య కావలి లక్ష్మీగా గుర్తించారు.

ఈనెల 4న ఇంట్లో నుంచి వెళ్లిన లక్ష్మీ శవమై లభించడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. లక్ష్మీకి భర్త లక్ష్మప్పతో పాటు ఇద్దరు కూతుర్లు అనిత, స్వాతి ఉన్నారు. సంఘటనా స్థలాన్ని నారాయణపేట డిఎస్పీ కె.సత్యనారాయణ, మక్తల్ సిఐ కె.రాంలాల్ సందర్శించి, పరిసరాలను పరిశీలించి, కుటుంబసభ్యులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. లక్ష్మీ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మక్తల్ ఎస్సై పర్వతాలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News