- Advertisement -
ఖమ్మంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ముక్కుకు ఆపరేషన్ నిర్వహిస్తుండగా మహిళ మృతి చెందింది. ఖమ్మం అర్బన్ పుట్టకోటకు చెందిన వెంకటలక్ష్మికి ముక్కలో గడ్డ ఏర్పడటంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి రాగా వైద్యలు ఆపరేషన్ చేయాలని తెలిపారు. దాంతో మహిళ మంగళవారం ముక్కు ఆపరేషన్ చేయించుకోవడానికి వచ్చింది. వైద్యులు ఆమెకు ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లి మృతి చెందింది. అనస్థీషియా డోస్ ఎక్కువ అవడం వల్లే మహిళ మృతి చెందిందని బంధువులు ఆరోపించారు. వైద్యుని నిర్లక్ష్యం వల్లే మహిళా మృతి చెందిందని మండిపడ్డారు. మృతి చెందిన మహిళ కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగి అద్దాలు ధ్వంసం చేశారు.
- Advertisement -