Thursday, December 26, 2024

బెంగళూరులో నీట మునిగిన కారు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : హైదరాబాద్ నుంచి బెంగళూరుకు విహార యాత్రకు వెళ్లిన ఓ కుటుంబంలో ఆదివారం అకాలవర్షం పెను విషాదాన్ని మిగిల్చింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఈ కుటుంబ యువతి భానురేఖ మృతి చెందారు. ఆమె బెంగళూరులో ఇన్‌ఫోసిస్ సంస్థలో పనిచేసే సాఫ్ట్‌వేర్ ఇంజనీరు అని సెలవు దినం కావడంతో కుటుంబంతో విహార యాత్రకు వచ్చినట్లు తెలిసింది. వర్షపు నీటి ఉధృతి ఆమె ప్రాణాలు తీసింది. కుటుంబానికి శోకాన్ని మిగిల్చింది. మధ్యాహ్నం బెంగళూరు నగరంలో భారీ వర్షంతో రహదారులు జలమయం అయ్యాయి. ఈ దశలోనే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ కుటుంబం కారులో హైదరాబాద్ నుంచి వచ్చి బెంగళూరు వీధులలో ప్రయాణిస్తుండగా కెఆర్ సర్కిల్ వద్ద అండర్ పాస్‌లోకి పెద్ద ఎత్తున వర్షపు నీరు వచ్చి చేరింది.

విధాన సౌధకు కూతవేటు దూరంలో జలమయం అయిన ఈ వీధిలో నీటి లోతు గురించి అంచనా వేయలేని డ్రైవర్ కారును నీళ్లలో నుంచే ముందుకు వెళ్లనిచ్చాడు, దీనితో కారులోకి పీకల వరకూ నీరు వచ్చింది. దీనితో లోపలున్న వారంతా ప్రాణభయంతో కేకలు పెట్టారు. ఆ దారిన వెళ్లే వారు, ఆ తరువాత సహాయక బృందాలు ముందుగా నలుగురిని బయటకు తీసుకురాగలిగాయి. అయితే ఈ లోగా నీటి మట్టం పెరగడంతో చాలా సేపటివరకూ కష్టపడి మరో ఇద్దరిని వెలికితీశారు. అయితే వీగాలిపీల్చుకోలేని స్థితిలో ఉన్న వీరిని ఆసుపత్రికి తరలించగా భానురేఖ చికిత్స దశలో మృతి చెందింది. ఆమె టెక్కి అని తెలిసింది. వీరంతా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారని వెల్లడైంది. అకాలవర్షాలతో తలెత్తిన పరిస్థితిపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. సహాయక చర్యలను వేగిరపర్చాలని అధికారులను ఆదేశించారు.

భానురేఖ చికిత్స పొందిన సెయింట్ మార్తాస్ ఆసుపత్రికి వెళ్లారు. ఆమె మృతి పట్ల సానుభూతి తెలిపిన సిఎం మృతురాలి కుటుంబానికి రూ 5 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. మృతి చెందిన భానురేఖ కృష్ణా జిల్లా తేలప్రోలు వాసి. కబ్బన్ పార్క్ చూసేందుకు ఈ తెలుగు వారి కుటుంబం వెళ్లుతుండగా ప్రమాదం జరిగింది. భారీ వర్షంతో బెంగళూరు అతలాకుతలం అయింది. పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. కుమారకృప రోడ్డుపై ట్రాఫిక్‌ను నిలిపివేశారు. చిత్రకళా పరిషత్ ఎదుట ఓ చెట్లు కూలిన ఘటనలో అక్కడున్న కారు , బైక్ ధ్వంసం అయ్యాయి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News