Saturday, November 9, 2024

వైద్యుల నిర్లక్ష్యం: బాలింత మృతి

- Advertisement -
- Advertisement -

మెదక్ : మెదక్ పట్టణంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ ఒ క్కసారిగా అస్వస్థతకు గురైంది. అత్యవసర చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమద్యలో మృతిచెందిన ఘటన బుధవా రం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్షం వల్లనే బాలింత మృతి చెందిందని ఆ రోపిస్తూ బంధువులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. నా ర్సింగి మండలానికి చెందిన సుతారి రేణుక పాపన్నపేట మండలం కొడుపాకకు చెందిన నాగరాజుతో వివాహం జరిగింది. పురిటి నొప్పులతో బాధపడుతున్న రేణుకను తల్లితండ్రులు మెదక్‌లోని మాతా శిశు సంరక్షణ కేంద్రంకు ప్రసవం కోసం మంగళవారం సాయంత్రం తీసుకొచ్చారు. ఇక్కడి వైద్యులు నార్మల్ డెలివరీ చేయగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం అనంతరం బాలింతకు తీవ్ర రక్తస్రావం అయిందని తెలుసుకుని ఆందోళనకు చెం దిన కుటుంబ సభ్యులు వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పరిస్థితి విషమం గా ఉందని గ్రహించిన వైద్యులు గాందీ ఆస్పత్రికి రెఫర్ చేశారు. అంబులెన్స్‌లో గాందీకి తరలిస్తుండగా రేణుక మార్గమద్యలో మృతిచెందినట్లు తెలిపారు. నార్మల్ డెలివరీ అయిన తర్వాత రక్తస్రవం కావడంపై కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వైద్యుల నిర్లక్షం వల్లనే బాలింత మృతి చెం దిందని ఆరోపిస్తూ మెదక్-_చేగుంట రహదారిపై ధర్నా నిర్వహించారు. వై ద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు మృతురాలు బంధువులు ఆందోళన నిర్వహించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. బాలింత మృ తిపై కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పో చ య్య తెలిపారు. బాలింత మృతిపై విచారణ కోరెందుకు ప్రయత్నించగా వై ద్యులు అందుబాటులోకి రాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News