Wednesday, January 22, 2025

వైద్యం వికటించడంతో బాలింత మృతి

- Advertisement -
- Advertisement -

వైద్యం వికటించడంతో ఓ మహిళ మృతిచెందిన సంఘటన బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…స్థానికంగా ఉంటున్న శాంతి(25) అనే యువతి గర్భిణీ కావడంతో డెలివరీ కోసం మోతీనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చేర్పించిన తర్వాత శాంతి ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. తర్వాత శాంతి ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా విషమంగా మారింది, ఈ క్రమంలోనే వైద్యులు బాధితురాలికి చికిత్స అందిస్తుండగానే మృతిచెందింది. వైద్యురాలి నిర్లక్ష్యం వల్లే తమ కూతురు మృతిచెందిందని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. వెంటనే బోరబండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News