Sunday, January 19, 2025

బైక్ పై నుండి పడి మహిళ మృతి

- Advertisement -
- Advertisement -

కమ్మర్‌పల్లి: కుమారుడితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మహిళ ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెందింది. కమ్మర్‌పల్లి మండలం హసాకోత్తూర్‌లో గ్రామపంచాయతీ కార్యాలయ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎస్‌ఐ రాజశేఖర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని హసాకోత్తూర్ గ్రామానికి చెందిన దేవి సావిత్రి (57) బుధవారం కుమారుడు అరుణ్‌తో కలిసి వ్యవసాయ పనులకు వేళ్లి తిరిగి ఇంటికి వెళ్తుండగా గ్రామపంచాయతి సమీపంలో స్పీడ్ బ్రెకర్ ఉండడం వల్ల బైక్ అదుపు తప్పి తల్లి కొడుకు బైక్ పై నుండి పడ్డారు.

ఈ ప్రమాదంలో తల్లి సావిత్రికి తలకు తీవ్రగాయాలైయ్యాయి. ఆర్మూర్ ఆసుపత్రికి తరలించగా మార్గం మద్యలో మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు కుమారులు, కుమార్తె, భర్త పోశన్న గల్ఫ్ లో ఉన్నాడు. మృతురాలి కుమారుడు సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని ఆర్మూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News