Thursday, April 3, 2025

దుంపగడ్డలకు కోసం వెళితే ప్రాణం పోయే..

- Advertisement -
- Advertisement -

జిల్లేడుచౌదరిగూడెంః చెరువులోకి దుంపగడ్డలకోసం వెళ్లి ఓ మహిళ మృత్యువాత పడ్డ ఘటన మండల పరిధిలోని గుంజల్‌పహడ్‌లో శనివారం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. ఏఎస్‌ఐ బాలస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. గుంజల్‌పహడ్ గ్రామానికి చెందిన బీస గౌరమ్మ (55) వృత్తి రిత్యా వీఆర్‌ఏ గా పని చేస్తుంది. శనివారం ఉదయం తన తోటి గ్రామస్తురాలైన చంద్రమ్మతో కలిసి జాకారం గ్రామంలో గల చెరువులోకి దుంపగడ్డల కోసం వెళ్లారు.

ఇద్దరు చెరువులో దుంపగడ్డలు తీస్తుండగా గౌరమ్మ లోతుగా ఉన్న నీటి గుంతలోకి వెళ్లగా పక్కనే ఉన్న చంద్రమ్మ ఒక్కసారిగా అరవగా చెరువు పక్కన ఉన్న పొలంలోని రైతులు వచ్చి గౌరమ్మను బయటికి తీసి చూడగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు. గౌరమ్మ కూతురు వరలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News