Sunday, December 22, 2024

వైద్యం వికటించి మహిళ మృతి..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/కొమురవెల్లి: కొమురవెల్లి మండల కేంద్రంలో లెనిన్ నగర్‌గ్రామానికి చెందిన దాసరి స్వర్ణ(38)భర్త దాసరి నగేశ్‌కు గత మూడు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతుండగా స్థానిక ఆర్‌ఎంపి వైద్యుడు సిద్దిపేట జిల్లా కొండపాక గ్రామానికి చెందిన రాళ్లబండి వెంకటేశ్ గత కొన్ని సంవత్సరాలుగా కొమురవెల్లి మండలం మర్రి ముస్తాల గ్రామంలో వైద్యం అందిస్తున్నాడు. అతని వద్దకు చికిత్స నిమిత్తం తీసుకువచ్చారు. మహిళను పరీక్షించి ఆర్‌ఎంపి డాక్టర్ ఇంజక్షన్ చేశారు. వేసిన కాసేపటికి కళ్లు తిరిగి పడిపోవడంతో హుటాహుటినా సిద్దిపేటలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మద్యలో మరణించిందని మృతురాలి భర్త ఆరోపిస్తున్నారు. ఆర్‌ఎంపి వేసిన ఇంజక్షన్ వల్లనే తన బార్య ప్రాణాలు కోల్పోయందని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్ధలానికి చేరుకొని పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి ఒక పాప, బాబు ఉన్నారు.

Woman Dies after medical treatment fail in Siddipet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News