Thursday, January 23, 2025

పెట్రోల్ పోసుకుని మహిళ మృతి

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట:పెట్రోల్ పోసుకొని మహిళ మృతి చెందిన సంఘటన మద్దిరాల మండల పరిధిలోని రెడ్డిగూడెంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ములుగు జిల్లా మ ంగపేట మండలం కత్తిగూడెం గ్రామానికి చెందిన బొటమంచి శాంతయ్య విజయ దంపతులకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. దగ్గరి బంధువు అయిన నాగెల్లి ఉపేం దర్‌కు గత 13 సంవత్సరాల క్రితం శృతి(29)ని ఇచ్చి వివాహం చేశారు.

అమ్మాయికి వివాహానికి ముందు నుంచి ఫిట్స్ వ్యాధితో బాధపడుతుండేదని, పలుమార్లు ఆత్మహత్యాప్రయత్నం చే సేదని అన్నారు. ఇంట్లో ఆర్థిక ప రిస్థితి తోడై మానసిక ఒత్తిడి గురై ఎవరు లేని సమయంలో గ్రామానికి కొద్ది దూరంలో పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకున్నట్లు తెలిపారు.

తొంబై శాతం కాలిన గా యాలతో కేకలు వేయడంతో గ్రామస్థులు గమనించి మంటలార్పి హుటాహుటిన సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, ప్రథమ చికిత్స నిర్వహించి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి పంపినట్లు తెలి పారు. చికిత్స పొందుతూ రాత్రి 10గంటల సమయంలో మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలికి ఒక కుమార్తె, కు మారుడు ఉన్నారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్సై రవీందర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News