Sunday, December 22, 2024

ట్రాక్టర్ బోల్తా పడి మహిళ మృతి

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: ట్రాక్టర్ బోల్తా పడి ఓ మహిళ మృతి చెందిన సంఘటన మాడ్గులపల్లి మండలం పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన సింగం సైదులు, జానమ్మ ఇద్దరు దంపతులు గ్రామ పరిధిలోని గడ్డంకుల సంస్థకు సంబంధించిన సాయి బాలాజీ వేర్ హౌసింగ్ అండ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ గోధాం కి సమీపంలో గుర్రం లింగారెడ్డి వ్యవసాయ భూమిని కౌలుకి తీసుకొని వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు.

అయితే బుధవారం రోజుమాదిరిగానే వ్యవసాయ పనులకు కోసం ఇద్దరు దంపతులు ట్రాక్టర్‌పై వెళ్లి పనులు చేసుకుని ఉదయం సుమారు 11: 30 నిమిషాల సమయం లో ఇంటికి వస్తున్న క్రమంలో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడి మహిళ సింగం జానమ్మ (32) అక్కడికక్కడే దుర్మరణం చెందింది. భర్త సైదులుకి గాయాలయ్యాయి తెలిపారు. ఈ ప్రమాదం గిడ్డంకుల సంస్థ యజమాన్యం నిర్లక్ష్యం వల్లనే జరిగిందని మృతురాలికి నష్టపరిహారం చెల్లించాలని మృతురాలి కుటుంబ సభ్యులు సాయి బాలాజీ వేర్ హౌసింగ్ గోదాము ఎదుట మృతదేహంతో ఆందోళనకు దిగారు.

వ్యవసాయ భూమికి వెళ్లే దారికి ఒక వైపున సంస్థ వైర్ హౌసింగ్ భూమి ఉండడంతో వారు పరిమితికి మించి మట్టిని తరలించడంతో దారి ఇరుకుగా ఏర్పడి గాతు చాలా లోతు గా ఉండడం వల్ల ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడి మహిళ చనిపోవడం జరిగిందని స్థానికులు అన్నారు. గోదాం యజమాన్యానికి చాలా సార్లు ఈ గాతు ప్రమాదానికి పొంచి ఉన్నదని ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని పలుమార్లు వారి దృష్టికి తీసుకెళ్లిన కూడా ఏమి పట్టనట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మృతురాలికి కుమారుడు,కూతురు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News