Sunday, December 22, 2024

కరెంట్ షాక్‌తో మహిళ మృతి

- Advertisement -
- Advertisement -

woman dies due to electric shock in nalgonda

తిప్పర్తి: ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌తో మహిళ మృతిచెందిన సంఘటన నల్గొండ జిల్లాలోని తిప్పర్తి మండలంలోని గోదావరిగూడెంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మృతురాలు బొల్లెద్దు నాగలక్ష్మి(42) తన ఇంట్లో దండెం మీద ఆరవేసిన బట్టలు తీస్తుండగా ప్రమాదవశాత్తు జీవైర్‌కు కరెంట్ ప్రసరించడంతో నాగలక్ష్మి షాక్‌తగిలి కింద పడిపోయింది. దీంతో చికిత్స కోసం ఆమెను నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. చికిత్స పొందుతూ నాగలక్ష్మి మృతిచెందినట్టు అధికారులు తెలిపారు. మృతురాలికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నట్టు వారు తెలిపారు. మృతురాలి భర్త బొల్లెద్దు నాగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News