Thursday, December 26, 2024

చికిత్స పొందుతూ మహిళ మృతి

- Advertisement -
- Advertisement -

హాజీపూర్‌ః మండలంలోని మామిడిపెల్లి గ్రామానికి చెందిన సంతోష అనే మహిళ చికిత్స పొందుతూ గురువారం హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వివరాలు ఇలావున్నాయి. సంతోషి భర్త గతంలోనే మృతి చెందాడు. అప్పటి నుండి సంతోషికి మతిస్థిమ్మితం లేదు. ఈ నెల 2న తన ఇంట్లో గుడ్‌నైట్ కాయల్‌ను అగ్గిపుల్లతో వెలిగిస్తుండగా, ప్రమాదవశాత్తు అగ్గిపుల్ల తన దుస్తులపై పడి తీవ్రంగా గాయపడగా,

గమనించిన కుటుంబ సభ్యులు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుప్రతికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలికి ఒక కుమారుడు సుధీర్ ఉన్నాడు. ఈ మేరకు మృతురాలి బాబాయ్ కలమడుగు స్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News