Sunday, December 22, 2024

అదుపు తప్పి ఆటో ప్రమాదం.. మహిళ మృతి

- Advertisement -
- Advertisement -

గుమ్మడిదల: గుమ్మడిదల మండలం అన్నారం గ్రామ పంచాయతీ పరిధిలోని పుల్లారెడ్డి కళాశాల యూటర్న్ వద్ద జరిగిన ఆటో ప్రమాదంలో మహిళ మృతి చెందడం జరిగింది. మృతురాలి కుమార్తె శ్రీలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతి చెందిన మహిళ పేరు కోమల పొట్ట కూటి కోసం వరంగల్ నుండి వలస వచ్చి దోమడుగు గ్రామంలో నివసిస్తున్నది. 20వ తేదీ సాయంత్రం 6 గంటలకు సొంత పని నిమిత్తం దోమడుగు నుండి అన్నారం వైపు వెళుతున్న టీఎస్ 35టిఏ 3578 నెంబర్ గల ఆటోలో ఎక్కింది.

ఆటో డ్రైవర్ తారక పాండు అతివేగంగా అజాగ్రత్తతో వాహనం నడపడంతో అదుపుతప్పి ఎదురుగా ఉన్న హోండా యాక్టివా టిఎస్ 15 ఈసీ 7815 ను బలంగా ఢీ కొట్టి రోడ్డు పక్కన గల రేలంగి గుద్దుకున్నదని ఆటోలో ప్రయాణిస్తున్న కోమల ఎగిరి పడి రేలింగ్ పై పడటంతో తలకు తీవ్ర గాయాలై ప్రమాద స్థలంలోనే మరణించినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి కూతురు ఫిర్యాదును ఆధారంగా చేసుకుని తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని ఈ సందర్భంగా పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News