Wednesday, January 22, 2025

తేనెటీగల దాడిలో మహిళ మృతి

- Advertisement -
- Advertisement -

పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, అమరారం గ్రామంలో బైక్‌పై వెళుతున్న భార్యాభర్తలు రవీందర్, సూర్యకాంతం, వారి ముగ్గురు చిన్నారులపై తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. వీరంతా ఆధార్ అప్టేడ్ చేసుకోవడానికి వెళుతుండగా మార్గమధ్యలో ఈ ఘటన చోటుచేసుకుంది. సూర్యకాంతం కింద పడటంతో తేనెటీలు విపరీతంగా కుట్టడంతో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యురాలు దుర్గ భవాని బిపి పల్స్ రికార్డు కాలేదని, పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. దీంతో మెరుగైన వైద్యం కోసం మణుగూరు 100 పడకల ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News