Sunday, December 22, 2024

మద్యం మత్తులో కారుతో మహిళను ఢీకొట్టిన యువకుడు.. మహిళ మృతి

- Advertisement -
- Advertisement -

మహాదేవ్‌పూర్: మద్యం మత్తులో కారు నడుపుతూ మహిళను ఢీకొట్టడంతో మహిళ మృతి చెందిన సంఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం సూరారం గ్రామ శివారులో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… మహాదేవ్‌పూర్ మండల కేంద్రానికి చెందిన యువకుడు మద్యం మత్తులో ఎర్ట్టిగా (టిఎస్ 07ఇఏఫ్ 8510) కారు నడుపుతూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ములుకల రామమణి (40)ని ఢీకొట్టాడు. దీంతో మహిళకు తీవ్ర గాయాలు కావటంతో స్థానికులు హుటాహుటిన మహాదేవ్‌పూర్ సామాజిక హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే రక్తస్రావం ఎక్కువ కావడంతో మహిళ గాయపడిన కొద్దిసేపటికే మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న మహాదేవ్‌పూర్ ఎస్‌ఐ రాజ్‌కుమార్ ప్రమాదానికి కారణమైన నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News