Sunday, December 22, 2024

బతుకు దెరువు కోసం వెళుతూ..అనంత లోకాలకు

- Advertisement -
- Advertisement -

పాల్వంచ : బతువు దెరువు కోసం వెళుతున్న ఓ కుటుంబాన్ని ప్రమాదం కాటేసింది. దీంతో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం వివరాల్లోకి వెళితే … మండల పరిధి ఉల్వనూర్ గ్రామానికి చెందిన అంబటి శ్రీను తన భార్య నాగమణి, కుమారుడు ప్రశాంత్, కోడలు సింధుజలతో ( కుటుంబం ) కలిసి బుధవారం ఉదయం మూడు గంటలకు తమ స్వంత కారులో హైదరాబాద్‌కు బతుకు దెరువు కోసం వెళుతున్నారు. మార్గ మధ్యలో జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం

కుందారం కెనాల్ సమీపంలోకి రాగానే కారు అదుపు తప్పి చెట్టుకు బలంగా ఢీకొన్నది. దీనితో సింధుజ (20 ) అక్కడికక్కడే మృతి చెందినది. శ్రీను, నాగమణి లకు కాళ్ళు, చేతులు విరిగాయి. ప్రశాంత్ పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. క్షతగాత్రులను హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మృతురాలిని ఘనపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా ప్రశాంత్, సింధుజల వివాహం జరిగి రెండు నెలలు మాత్రమే అవుతుందని, ప్రమాదం కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిందని, గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News