Wednesday, January 22, 2025

తల్లి మృతితో అనాథలైన ముగ్గురు పిల్లలు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందడంతో ముగ్గురు పిల్లలు అనాథలైన సంఘటన నగరంలోని ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పిఎస్ పరిధిలో నివాసం ఉంటున్న సంధ్య బిజేఆర్ నగర్ రోడ్డులో స్కూటీపై వెళ్తుండగా ట్రాలీ ఆటో ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన సంధ్యను ఆస్పత్రిలో చేర్పించేందుకు తీసుకుని వెళ్తుండగా మృతి చెందింది.

సంధ్య భర్త విష్ణు ఏడాది క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు సంధ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ముగ్గురు పిల్లలు అనాథలుగా మారారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఫిలింనగర్ పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News