Thursday, November 21, 2024

దర్గా కాజీపేట రోడ్డులో దారుణం

- Advertisement -
- Advertisement -

కాజీపేట: కాజీపేట పట్టణం దర్గా రోడ్డులో భర్త మోటర్ సైకిల్ ఎక్కుతున్న మహిళను అతి వేగంగా వచ్చిన ఓ కారు
గురువారం మద్యాహ్ననం ఢీకొట్టిన ఘటనలో మహిళ మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది.పోలీసులు పట్టించుకోవడం లేదంటు మృతురాలు కుటుంబ సభ్యులు, బందువులు ఫాతిమానగర్‌లో శుక్రవారం మద్యాహ్నం రిస్తారోకో, పోలీస్‌స్టేషన్ ముట్టడి చేశారు. దాదాపు రెండు గంటలకుపైగా ఎక్కడి ట్రాఫిక్ అక్కడే స్తంభించి పోయింది. ఫాతిమానగర్ మీదుగా నగరం, కాజీపేటవైపు రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఏదుర్కొన్నారు, బందువులు,కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఫాతిమానగర్ శౌరినగర్‌లో గాదె కవిత(38)జోసఫ్ రెడ్డి, ఇద్దరు పిల్లలతో నివాసముంటున్నాడు, కవిత నగరంలో ప్రైవేటు దవాఖానలో నర్సుగా, జోసఫ్‌రెడ్డి సెయింట్ గాబ్రియెల్ స్కూల్‌లో సోషల్ టీచర్‌గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు జోషిత 8వ తరగతి, భావన 2వ తరగతి చదువుతున్నారు.

సెయింట్ గాబ్రియెల్ స్కూల్‌లో శుక్రవారం జరిగిన పోలింగ్‌లో భార్య కవిత.. జోసప్‌రెడ్డిలు ఓటు హక్కును వినియోగించుకున్నారు, తిరిగి ఇంటికి చేరుకునే క్రమంలో వారి బైక్ ఎక్కుతుండగా ఫాతిమానగర్ నుంచి దర్గా కాజీపేటకు అతివేగంగా వెళ్లుతున్న కారు డీకొట్టి కొంత దూరం ఈడ్చుకుపోయిందని తెలిపారు. అక్కడే ఉన్న భర్త తీవ్రగాయలైన అపస్మారక స్థితిలోకి చేరుకున్న కవిత ప్రాణాలు కాపాడుకునేందుకు దవాఖానకు తరలిస్తుండగా చనిపోయిందన్నారు. సీసీకెమెరా పుటేజీల అధారంగా కాజీపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు. కారుతో డీ కొట్టిన వ్యక్తి ఎక్సైజ్ పోలీస్ శాఖకు చెందిన అధికారి కుమారుడు కావడం వల్లనే పోలీసులు పట్టించుకోవడంలేదంటు మృతురాలి బందువులు, కుటుంబసభ్యులు కాజీపేట పోలీస్ స్టేషన్ ముట్టడించి పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగిన మృతురాలి బందువులతో పోలీసులు నిందుతునిపై కేసు నమోదు చేశామని, తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నచ్చచెప్పారు.

పోలీస్ స్టేషన్ ముందు అందోళన విరమించిన బాధితుల కుటుంబసభ్యులు ఫాతిమానగర్ బ్రిడ్జివద్ద దాదాపు రెండు గంటలకు పైగా రాస్తారోకో చేశారు. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయి భారీగా ట్రాఫిక్‌జాం అయ్యింది. అటు నిట్ కళాశాల, వడ్డెపల్లి, వందఫీట్ల రోడ్డు వరకు ఇటు కాజీపేట చౌరస్తా వరకు బ్రిడ్జికి ఇరువైపుల రెండుకిలో మీటర్ల వరకు ట్రాఫిక్ స్తంబించిపోయింది. ట్రాఫిక్ జాం అయిన విషయం తెలుసుకున్న ట్రాఫిక్ ఏసిపి భోజరాజు నేతృత్వంలో లా అండ్ ఆర్డర్ సిఐలు సుజాత, సార్ల రాజు, మడికొండ సిఐ వేణు, ఎస్సైలు లలిత, నర్సింహరావు,రాజేష్‌లతో కలిసి ట్రాఫిక్ క్లియర్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News