Sunday, December 22, 2024

మాజీ ఎంఎల్‌ఎ రాజయ్య కారు ఢీకొని మహిళ మృతి

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ మాజీ ఎంఎల్‌ఎ రాజయ్య ప్రయాణిస్తున్న కారు ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన హన్మకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండలో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం మడికొండకు చెందిన కలకోట స్వప్న(40) ఎస్‌సి కాలనీ వద్ద శనివారం రాత్రి డివైడర్ చెట్ల మధ్య నుంచి రోడ్డు దాటుతుండగా హైదరాబాద్ నుంచి హన్మకొండకు వెళ్తున్న రాజయ్య కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాద సమయంలో రాజయ్య కారులో ఉన్నారు. కారును బాపూజీనగర్‌లో వదిలేసి మడికొండ పోలీసులకు రాజయ్య సమాచారం ఇచ్చి వెళ్లిపోయాడు. డ్రైవర్ పరారీలో ఉన్నాడు. కేసు పోలీసుల దర్యాప్తులో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News