Sunday, December 22, 2024

కూరగాయల లోడుతో వెళ్తున్న వాహనం బోల్తా..ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

కొడంగల్‌ః కూరగాయల లోడుతో వెళ్తున్న బోలేరో వాహనం బోల్తా పడడంతో ఓ మహిళ మృతి చెందారు. ఈ సంఘటన ఆదివారం పట్టణ శివారులోని బండల ఎల్లమ్మ దేవాలయం వద్ద జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఏఎస్‌ఐ బాలకీషన్ తెలిపిన వివరాల మేరకు దౌల్తాబాద్‌కు చెందిన యాదయ్య కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు. ఆదివారం బోంరాస్‌పేట మండలం తూంకిమెట్ల వారంతపు సంత

కావడంతో భార్య లక్ష్మీతో పాటు గ్రామానికి చెందిన మొగులమ్మ(34), దస్తమ్మలతో కలిసి సంతకు బయలు దేరాలు. కూరగాయల లోడుతో వీరు ప్రయాణిస్తున్న టిఎస్34టీబి0340 నెంబరు గల వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వెనకాల కూర్చున్న మొగులమ్మ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి తల్లి హన్మమ్మ ఫీర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తూ చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News