Friday, April 4, 2025

రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం….

- Advertisement -
- Advertisement -

మంచాల: ఆగాపల్లి సాగర్ రహదారిపై సోమవారం మధ్యాహ్నం రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో మహిళ దుర్మరణం చెందింది. వివరాలలోకి వెళితే.. స్థానికుల కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రానికి చెందిన ఎన్ లలిత(38) చింతపల్లి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా హైదరాబాద్ నుంచి ఎదురుగా వస్తున్న కారు బలంగా ఢీ కొట్టడంతో కారులో కూర్చున్న లలిత అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.

కారులో ఉన్న మరో ముగ్గురికి స్వల్ప గాయలయ్యాయి.స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు శవ పరీక్ష నిమిత్తం మృతదేహన్ని ఇబ్రహీంపట్నం సివిల్ అస్పత్రికి తరలించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యప్తు చేస్తున్నట్లు పోలీసులు  తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News